|
| ఇండోనేషియాలో విమాన ప్రమాదం: 68మంది మృతి |
| జకార్తా (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 10:06 IST ) | |
ఇండోనేషియాలో సైనిక విమానం కూలిపోయిన ఘటనలో కనీసం 68మంది మృతి చెందారు. మొత్తం 100మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కూలిపోయిన నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అనేకమంది మృతి చెంది ఉండవచ్చని స్థానిక టెలివిజన్‌లు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం రంగంలో దిగిన సైనికులు మృత దేహాలను, క్షతగాత్రులను అక్కడినుంచి తరలిస్తుండగా వారిలో చాలామంది పూర్తిగా కాలిపోయారని ఆ ఛానెల్స్ పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సి-130 హెర్కులస్ అనే పేరుగల ఈ విమానం 112మంది ప్రయాణీకులు, సిబ్బందితో సహా ప్రయాణిస్తూ తూర్పు జావా ప్రావీన్స్ వద్దగల ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద కూలిపోయిందని తెలిపారు.
ఈ విమానం కూలిన ప్రాంతంలో ఉన్న నాలుగు ఇళ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ విమానం కూలిపోయిన సమయంలో పెద్దస్థాయిలో మంటలు వచ్చినట్టు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|