యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తమిళులకు సమాన హక్కులు: రాజపక్స హామీ
కొలంబో (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 09:48 IST )
ఎల్టీటీఈపై విజయం సాధించడం ద్వారా శ్రీలంక ప్రభుత్వ దళాలు ఆ దేశంలో దశాబ్దాల తరబడిసాగిన వేర్పాటువాద ఉద్యమానికి తెరదించాయి. శ్రీలంక సైన్యం మంగళవారం ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ మృతదేహానికి సంబంధించిన దృశ్యాలను కూడా వార్తా ఛానళ్లకు విడుదల చేసింది. ప్రభాకరన్ మరణంతో ఎల్టీటీఈపై సంపూర్ణ విజయం సాధించామని లంక సైన్యం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మాట్లాడుతూ.. దేశంలోని తమిళ పౌరులకు సింహళీయులతో సమాన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ మార్గాల ద్వారా తమిళులకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే సమస్య పరిష్కారంలో ఇతర దేశాల సూచనలు తీసుకోవాలనుకోవడం లేదన్నారు.

ప్రభుత్వం మిలటరీ పరిష్కారాన్ని అంగీకరించదని, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం తన లక్ష్యమని చెప్పారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పౌరులకు హక్కుగా ఉన్న స్వేచ్ఛను ఉత్తర ప్రాంతంలోని తమిళులకు కూడా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచంలో మరే ఇతర దేశం లేదా ప్రభుత్వం సాధించని రీతిలో వారికికావాల్సిన రాజకీయ పరిష్కరాన్ని వేగంగా వారికి అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తాము ఈ పరిష్కారాన్ని దిగుమతి చేసుకోవాలనుకోవడం లేదన్నారు. ఇతర దేశాలు ప్రతిపాదించిన పరిష్కారాలతో పరిశీలనలు జరిపే సమయం తమ వద్ద లేదని స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా కారణం
ఎల్టీటీఈ అధినేత పెద్దపులి మృతదేహం గుర్తింపు
శ్రీలంకలో యుద్ధ విజేతలం మేమే: రాజపక్స
పాక్ ఐఎస్ఐకి వ్యూహాత్మక రక్షణగా తాలిబాన్లు
స్వాత్ లోయలో 27 మంది తాలిబాన్ల హతం
అణ్వస్త్రాల కోసం సాయం చేయలేదు: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...