|
| పాక్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా కారణం |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 09:32 IST ) | |
ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వం దాని నుంచి బయటపడేందుకు సైనిక చర్యకు దిగింది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ సైనిక చర్య చేపట్టింది.
మొదట్లో తాలిబాన్లతో శాంతి ఒప్పందం పేరుతో సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో షరియా (ఇస్లామిక్) చట్టాన్ని అమలు చేసేందుకు అంగీకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు దానిని పక్కనబెట్టి పోరుబాట పట్టింది. గత కొన్ని వారాలుగా తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న స్వాత్ లోయలో వందలాది మంది ఉగ్రవాదులను పాక్ సైన్యం హతమార్చింది.
ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మంగళవారం పాకిస్థాన్‌లో పరిస్థితులపై మాట్లాడుతూ.. అక్కడి సంక్షోభానికి అమెరికా కూడా కారణమని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ సేనలు వెనక్కు వెళ్లిపోయిన తరువాత అమెరికా చాలా తొందరపడి పాకిస్థాన్ నుంచి వెనక్కువచ్చేసిందని హిల్లరీ తెలిపారు.
ఈ తొందరపాటు చర్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి కారణమైందని, దీనికి అమెరికా కూడా బాధ్యత వహించాల్సి ఉందని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అమెరికా ప్రభుత్వం గతంలో పెద్దమొత్తంలో నిధులు ఇచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంపై సమాధానమిస్తూ ఆమె సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా పాకిస్థాన్ విషయంలో తమ విధానం అర్థవంతంగా లేదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|