|
| ఎల్టీటీఈ అధినేత పెద్దపులి మృతదేహం గుర్తింపు |
| కొలంబో (ఏజెన్సీ), 19 మే 2009 ( 13:41 IST ) | |
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించి ఇటీవల సైనిక దాడిలో మృతి చెందిన ఎల్టీటీఈ అధినేత వి. ప్రభాకరన్ మృతదేహాన్ని లంక సైన్యం గుర్తించింది. ఈ సందర్భంగా శ్రీలంక సైన్యం విడుదల చేసిన ప్రభాకరన్ మృతదేహం దృశ్యాలను వివిధ మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి.
ప్రభాకరన్ మృతికి సంబంధించి సోమవారం మధ్యాహ్నం శ్రీలంక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాత మంగళవారం ఈ వీడియోలు ప్రసారం కావడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం సోమవారం ప్రభాకరన్ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన చేసినా ఆయన మృత దేహాన్ని గుర్తించలేదని పేర్కొనడంతో ఈ ప్రకటనపై పలు సందేహాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఎల్టీటీఈ ఓ ప్రకటన చేస్తూ ప్రభాకరన్ మృతి చెందలేదని ఆయన బ్రతికే ఉన్నారంటూ ప్రకటించింది. ఇలా శ్రీలంక ప్రభుత్వం, ఎల్టీటీఈలనుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో తాజాగా ప్రభాకరన్ మృతదేహాన్ని సైతం గుర్తించడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|