|
| శ్రీలంకలో యుద్ధ విజేతలం మేమే: రాజపక్స |
| కొలంబో (ఏజెన్సీ), 19 మే 2009 ( 12:22 IST ) | |
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం హతమార్చిన ఒక రోజు తరువాత ఆ దేశ అధ్యక్షుడు మహీంద రాజపక్స యుద్ధంలో తామే విజేతలుగా నిలిచామని ప్రకటించారు. అయితే ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించిన ప్రభాకరన్ మృతిపై రాజపక్స ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దేశ ప్రజలు ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.
ఎల్టీటీఈపై ప్రభుత్వ దళాలు విజయం సాధించాయని రాజపక్స వెల్లడించారు. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈని మట్టికరిపించిన అనంతరం రాజపక్స మంగళవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ మరణంపై ఆయన ఈ సందర్భంగా స్పందించలేదు.
ఎల్టీటీఈ చీఫ్ భౌతికదేహాన్ని స్పష్టంగా గుర్తించే పనిలో ఉన్న కారణంగా రాజపక్స ప్రకటనలో ప్రభాకరన్ మృతిపై ఏమీ మాట్లాడలేదని పరిశీలకులు భావిస్తున్నారు. చివరి దశ పోరులో మృతి చెందిన 250 మంది ఎల్టీటీఈ తీవ్రవాదుల్లో ప్రభాకరన్ కూడా ఉన్నారని ప్రభుత్వాధికారులు సోమవారం వెల్లడించారు.
మృతుల్లో ప్రభాకరన్ కుమారుడు ఛార్లస్ ఆంథోనీ, ఇతర అగ్రనేతలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చివరి పోరులో సుమారు 250 మంది తీవ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.
వీటిలో ప్రభాకరన్ మృతదేహం ఉన్నట్లు పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో సైనిక చర్యలు పూర్తిగా నిలిపివేశామని శ్రీలంక మిలటరీ చీఫ్ శరత్ ఫోన్సెకా ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశం ఇప్పుడు తీవ్రవాదం కోరల నుంచి పూర్తిగా బయటపడిందన్నారు. ఇదిలా ఉంటే ఎల్టీటీఈ వెబ్‌సైట్ ప్రభాకరన్ ప్రాణాలతోనే ఉన్నాడని పేర్కొనడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|