|
| పాక్ ఐఎస్ఐకి వ్యూహాత్మక రక్షణగా తాలిబాన్లు |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 11:36 IST ) | |
పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తాలిబాన్ తీవ్రవాదులను వ్యూహాత్మక రక్షణగా ఉపయోగించుకుందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎం గేట్స్ అభిప్రాయపడ్డారు.
పొరుగునున్న ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న యుద్ధంలో ఎటువంటి ఫలితం వస్తుందనే దానిపై అనిశ్చితి నెలకొనడంతో తాలిబాన్లను పాక్ ఐఎస్ఐ వ్యూహాత్మక కంచెగా ఉపయోగించుకుందని గేట్స్ పేర్కొన్నారు.
తాలిబాన్లతో ఐఎస్ఐ సంబంధాలపై తన అభిప్రాయం ఇదేనని గేట్స్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లకు, సంకీర్ణ సేనలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరూ గెలుస్తారో స్పష్టంగా తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాలిబాన్లతో పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు కొనసాగించి ఉండవచ్చని గేట్స్ సీబీఎస్ "60 మినిట్స్" కార్యక్రమంలో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ కొత్త వ్యూహాన్ని మార్చిలో ప్రకటించినప్పటి నుంచి పాక్ ఐఎస్ఐ- తాలిబాన్ సంబంధాలపై రాబర్ట్ గేట్స్, రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|