యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
స్వాత్ లోయలో 27 మంది తాలిబాన్ల హతం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 11:18 IST )
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో భద్రతా దళాలు సోమవారం వేర్పేరుచోట్ల జరిపిన దాడుల్లో 27 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అథార్ అబ్బాస్ మాట్లాడుతూ.. మృతి చెందిన తీవ్రవాదుల్లో ముగ్గురు తాలిబాన్ కమాండర్లు ఉన్నారని చెప్పారు.

ఇదిలా ఉంటే తాజా పోరులో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. సైనిక చర్య కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన పౌరులను శరణార్థులగా పిలువవద్దని మీడియాకు పాక్ సమాచార శాఖ మంత్రి ఖమర్ జమాన్ కైరా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం స్వాత్ లోయ పరిసర ప్రాంతంలో భద్రతా దళాలు, తాలిబాన్లకు మధ్య జరుగుతున్న పోరు కారణంగా సుమారు 1.6 మిలియన్ల మంది పౌరులు సురక్షిత ప్రాంతలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లోని బునెర్, దీర్ జిల్లాల్లో తీవ్రవాదుల ఉనికికి దాదాపుగా తెరపడిందని కైరా వెల్లడించారు. ప్రాణభయంతో తరలివెళ్లిన పౌరులు త్వరలోనే శుభవార్త వింటారని, తిరిగి వారి ఇళ్లకు చేరుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణ్వస్త్రాల కోసం సాయం చేయలేదు: అమెరికా
ప్రభాకరన్ మృతి: లంకలో పౌర యుద్ధానికి తెర
శ్రీలంకలో యుద్ధానికి తెర: ప్రభాకరన్ హతం
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కాల్చివేత?
జపాన్‌లో 121కి చేరిన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య
రెండు తాలిబాన్ ప్రాంతాలపై పాక్ దళాల పట్టు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...