|
| అణ్వస్త్రాల కోసం సాయం చేయలేదు: అమెరికా |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 09:56 IST ) | |
పాకిస్థాన్ అణ్వస్త్రాలను, అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు తన మిలటరీ, పౌర అవసరాల కోసం అమెరికా నుంచి పాక్ ప్రభుత్వం పెద్దఎత్తున సాయం పొందుతోంది. అయితే పాక్ అణు సామర్థ్యం విస్తరణకు, తమ సాయానికి ఎటువంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం స్పష్టం చేసింది.
తమ సహాయ ప్యాకేజీకి, అణు సామర్థ్యానికి సంబంధాలు లేవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కెల్లీ తెలిపారు. పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని విస్తరించుకుంటుందని ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనంపై కెల్లీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సహాక ప్యాకేజీ ప్రత్యేక అవసరాలకు ఉద్దేశించినదని తెలిపారు. ఈ ప్యాకేజీని సరైన విధంగా ఉపయోగించేలా అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
అమెరికా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకాలంలో పాకిస్థాన్‌కు 7.5 బిలియన్ డాలర్ల మిలటరీయేతర సాయాన్ని అందించాలనుకుంటుంది. అంతేకాకుండా మిలటరీ సాయాన్ని కూడా ఒబామా యంత్రాంగం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో కెల్లీ మాట్లాడుతూ తమ సహాయ ప్యాకేజీ ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడేలా చూస్తామని స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|