|
| ప్రభాకరన్ మృతి: లంకలో పౌర యుద్ధానికి తెర |
| కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 09:41 IST ) | |
శ్రీలంకలో 26 ఏళ్లపాటు సాగిన వేర్పాటువాద ఉద్యమానికి ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మృతితో తెరపడింది. ఎల్టీటీఈ చీఫ్ సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని శ్రీలంక ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక ఉత్తర ప్రాంతంపై ఎల్టీటీఈ ఆధిపత్యాన్ని శ్రీలంక సైన్యం సమాధి చేసినట్లయింది.
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, శ్రీలంకలో పలువురు నేతల హత్యలకు ప్రధాన సూత్రధారి అయిన ప్రభాకరన్ యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా సైనికులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శ్రీలంక రాజధాని కొలంబోతోసహా, చాలా ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి.
54 ఏళ్ల ప్రభాకరన్ 1972లో ప్రత్యేక తమిళ దేశం కలను నెరవేర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఎల్టీటీఈ అధిపతిగా రెండు దశాబ్దాలకుపైగా దేశంలో వేర్పాటువాద ఉద్యమానికి ఊపిరి పోస్తూ వచ్చారు. సింహళీయులు మెజారిటీ కలిగిన శ్రీలంకలో మొత్తం 20 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు.
ఎల్టీటీఈ వేర్పాటువాద ఉద్యమం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వారు కొన్నేళ్లపాటు కాలంవెల్లదీసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎల్టీటీఈపై యుద్ధానికి దిగిన శ్రీలంక సైన్యం సోమవారం పూర్తిస్థాయిలో విజయం సాధించింది. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్, ఆయన కుమారుడు ఛార్లస్ ఛాథోనీ, ఇతర అగ్రనేతలు హతమవడంతో శ్రీలంక సైన్యం దేశం మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|