|
| శ్రీలంకలో యుద్ధానికి తెర: ప్రభాకరన్ హతం |
| కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009 ( 18:12 IST ) | |
శ్రీలంకలో గత కొన్ని దశాబ్దాల వేర్పాటువాద ఉద్యమానికి సోమవారం పూర్తిగా తెరపడింది. ఎల్టీటీఈ నేతృత్వంలో నడుస్తున్న వేర్పాటువాద ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయడం కోసం నడుంబిగించిన శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎన్నిసార్లు అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చినా వెనుదిరగకుండా ఎట్టకేలకు విజయబావుటా ఎగురవేశాయి.
ఎల్టీఈటీ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను తమ దళాలు హతమార్చాయని శ్రీలంక ప్రభుత్వం సోమవారం అధికారంగా ప్రకటించింది. శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలోని యుద్ధ ప్రదేశం నుంచి ప్రభాకరన్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆయనను సైనికులు కాల్చిచంపారు. దీంతో ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఎల్టీటీఈ నడిపిన మూడు దశబ్దాల వేర్పాటువాద ఉద్యమానికి తెరపడినట్లయింది.
సోమవారం ఉదయం నుంచే మీడియాలో ప్రభాకరన్ మరణంపై భిన్న కథనాలు వచ్చాయి. మధ్యాహ్నం వరకు ప్రభాకరన్ మృతిని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఆపై శ్రీలంక ప్రధానమంత్రి రత్నసిరి విక్రమనాయకే ఓ ప్రైవేట్ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. ప్రభాకరన్ మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రభాకరన్ మృతి చెందినట్లు, ఎల్టీటీఈ ఆధీనంలోని మొత్తం భూభాగాన్ని సైన్యం కైవసం చేసుకుందని విక్రమనాయకే చెప్పారు.
ప్రభాకరన్ మృతదేహాన్ని సరిగా నిర్ధారించుకున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలా ఉంటే శ్రీలంక మిలటరీ ఎల్టీటీఈపై తన విజయాన్ని ప్రకటించుకుంది. ఎల్టీటీఈ ఆధీనంలోని అన్ని ప్రాంతాలు ఇప్పుడు సైన్యం హస్తగతం అయ్యాయని తెలిపింది. అంతేకాకుండా ప్రభాకరన్ కుమారుడు ఛార్లస్ ఆంథోనీ, మరో ముగ్గురు అగ్రనేతలు కూడా తాజా పోరులో మృతి చెందారని వెల్లడించింది.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ప్రభాకరన్, మరో ఇద్దరు ఎల్టీటీఈ అగ్రనేతలు సూసై, పొత్తు అమ్మన్‌లు ఆంబులెన్స్‌లో యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీరి వాహనం, వెనుక ఎల్టీటీఈ తీవ్రవాదులతో కూడిన బస్సు సోమవారం ఉదయం తమను సమీపిస్తుండగా శ్రీలంక దళాలు కాల్పులు జరిపాయి. దాదాపుగా రెండు గంటల కాల్పుల అనంతరం మిలటరీ పేల్చిన రాకెట్‌కు ప్రభాకరన్ ఉన్న వ్యాను ముక్కలైంది. దళాలు ఈ వ్యానులో ప్రభాకరన్ మృతదేహాన్ని గుర్తించాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|