|
| ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కాల్చివేత? |
| కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009 ( 14:01 IST ) | |
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను కాల్చిచంపినట్లు ఆ దేశ రక్షణ శాఖ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ దళాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయాడు.
ప్రభాకరన్, ఆయన ఇద్దరు సన్నిహితులు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి ఆంబులెన్స్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరు శ్రీలంక సైన్యం జరిపిన దాడిలో హతమయ్యారని రక్షణ శాఖ అధికారి వెల్లడించారు. ఆంబులెన్స్‌లో వెళుతున్న ప్రభాకరన్‌తోపాటు, మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తరువాత వెలువడుతుందని చెప్పారు.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు సైతం తలొగ్గకుండా ఎల్టీటీఈ తీవ్రవాదులపై శ్రీలంక ప్రభుత్వ దళాలు భీకర పోరు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీలంక ప్రభుత్వ దళాలు సోమవారం మరో నలుగురు ఎల్టీటీఈ అగ్రనేతలను కూడా హతమార్చాయి. వీరిని ప్రభాకరన్ కుమారుడు ఛార్లస్ ఆంథోనీ, నదేశన్, రమేష్, సేవరత్నం పులేదేవన్‌లుగా గుర్తించినట్లు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|