|
| పాక్‌లో కారుబాంబు పేలుడు: 10మంది మృతి |
| పెషావర్ (ఏజెన్సీ), శనివారం, 16 మే 2009 ( 16:42 IST ) | |
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శనివారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా పదిమంది మృతి చెందారు. పెషావర్‌లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ కారుబాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని తాలిబన్ తీవ్రవాదులతో పాక్ సేనలు పోరాటం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
కాక్సల్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలడం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో జనసమర్థంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా చోటు చేసుకుంది. ఓ సైబర్ కేఫ్ ముందు నిలబెట్టిన ఈ కారు పేలిన కారణంగా ఆ సైబర్ కేఫ్ సైతం భారీగా ధ్వంసమైంది.
ఇక ఈ పేలుడు సంభవించిన ప్రాంతంలో చిన్న పిల్లల స్కూలు బస్సు సైతం ఉండడంతో అందులోని చాలామంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు సంబంధించి ప్రస్తుతానికి ఏ సంస్థకూడా తామే చేసినట్టుగా ప్రకటించలేదు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో రంగంలో దిగిన అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|