యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్‌లో పేలుడు: ఎనిమిదిమంది మృతి
పెషావర్ (ఏజెన్సీ), శనివారం, 7 మార్చి 2009   ( 11:23 IST )
వాయువ్య పాకిస్థాన్‌లోని నగరమైన పెషావర్‌లో శనివారం జరిగిన బాంబు పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందినవారిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. గుర్తుతెలియని ఓ కారులో అమర్చిన బాంబు పేలడంతో ఈ ఘటన సంభవించింది.

పెషావర్ శివారు ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ పోలీసు వ్యాను వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన తెల్లనికారు అకస్మాత్తుగా పేలడంతో పోలీసువ్యాను కూడా పేలిందని పేర్కొన్నారు. ఇది మానవబాంబు పేలుడు కూడా అయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

గత మంగళవారం పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక ఆటగాళ్లపై తీవ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందడంతోపాటు క్రికెటర్లు కూడా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కేవలం నాలుగు రోజుల్లో ఈ పేలుడు సంభవించడం విశేషం.

గత రెండేళ్లుగా పాకిస్థాన్‌లో తాలిబన్, లష్కరే తోయిబా ప్రేరేపిత తీవ్రవాదులు జరుపుతున్న పేలుళ్లు సర్వ సాధారణంగా మారాయి. అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలను నిరసించే మతతత్వ తీవ్రవాద సంస్థలే ఈ రకమైన పేలుళ్లకు పాల్పడుతున్నట్టు అక్కడి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆఫ్ఘన్‌లో భారత్‌ పాత్ర: అమెరికా, కెనడా చర్చలు
యూరప్‌లో తొలిసారిగా పర్యటించనున్న ఒబామా
అంతర్గత హెచ్చరికలను ఎదుర్కొంటున్న పాక్
స్వాత్‌ లోయలో నిబంధనలకు పాక్ ఓకే
నేడు భారత పర్యటనకు రానున్న ముషారఫ్
ఇరాక్‌ మార్కెట్‌లో పేలుడు: 12మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నెగటివ్ పాత్రలు చేయడానికి సిద్ధం: శర్వానంద్
గమ్యం చిత్రం ద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్ ఆ చిత్రానికి ముందే...
ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో చిత్రం
పుట్టినరోజు సంబరాల్లో కమిలినీ ముఖర్జీ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...