|
| భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవే: అమెరికా |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009 ( 11:26 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి భారత్ ఇచ్చిన సాక్ష్యాలు నమ్మదగినవేనని అమెరికా దౌత్యాధికారి డేవిడ్ ముల్‌ఫోర్డ్ చెప్పారు. ముంబయి దాడులకు సంబంధించి ఇటీవల పాకిస్థాన్‌కు భారత్ సాక్ష్యాధారాలు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదని పాకిస్థాన్ వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో డేవిడ్ ముల్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాల్లో విశ్వసనీయత ఉందని స్పష్టం చేశారు. భారత్ సేకరించిన సాక్ష్యాల్లో ఎఫ్‌బీఐ సాయం కూడా తీసుకుందని వెల్లడించారు. విశ్వసనీయత లేని వాటిలో ఎఫ్‌బీఐ జోక్యం చేసుకోదని తెలిపారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌ను కలిసిన సందర్భంగా ముల్‌ఫోర్డ్ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతకుముందు పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాలిక్ అమద్ ఖాన్, విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ భారత్ అందించిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|