యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
కసబ్ మావాడే: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 09:32 IST )
ముంబయి మారణహోమంలో భారత భద్రతా దళాలకు పట్టుబడిన కసబ్ తమ దేశీయుడేనని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మహ్మద్ అలీ దురానీ అనధికారికంగా ఆ దేశానికి చెందిన జియో న్యూస్ ఛానల్‌తో చెప్పారు. ముంబయి దాడుల్లో దొరికిన కసబ్ తమ దేశీయుడనే భారత్ వాదనతో పాక్ ఇప్పటివరకు ఏకీభవించని సంగతి తెలిసిందే.

అయితే పాక్ జాతీయ భద్రతా సలహాదారు దురానీ బుధవారం అనధికారికంగా మాట్లాడుతూ.. కసబ్ తమ దేశానికి చెందినవాడేనని, దీనికి సంబంధించిన ప్రకటన మరికొన్ని గంటల్లో అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడిస్తుందని చెప్పారు. మరో భారత ఛానల్‌కు కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.

కసబ్‌ను తమ జాతీయుడేనని ధృవీకరించే నివేదికను పాక్ ప్రధాని గిలానీకి కూడా అందించనున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షెర్రీ రెహమన్ కూడా ఒక వార్తా సంస్థకు పంపిన ఎస్ఎంఎస్‌లో కసబ్ తమ దేశీయుడేనని పేర్కొన్నారు. ముంబయి దాడులపై పాకిస్థాన్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతుందని రెహమాన్ చెప్పారు.

అయితే కసబ్‌ పాకిస్థాన్‌కు చెందినవాడేనని దురానీ మీడియాకు వెల్లడించడంపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. ఈ కారణంతోనే పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఆయనను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి తొలగించారు. ప్రధానమంత్రి, ఇతర ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులు లేకుండా, ఈ విషయంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినందుకు దురానీపై వేటు పడింది.

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో సమన్వయ లోపం ప్రదర్శించడం కూడా ఇందుకు మరో కారణం. అజ్మల్ కసాబ్ పాకిస్థానీయుడేనని జాతీయ భద్రతా సంస్థల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ సాదీఖ్ వెల్లడించారు. మీడియాలో కసబ్ పాకిస్థానీయుడేనని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సాదీఖ్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో ఈ విషయం తేలిన మాట వాస్తవమేనని వెల్లడించారు.

ఇదిలా ఉంటే కసబ్‌కు పాక్ ప్రభుత్వ సంస్థలతో ఎటువంటి సంబంధాలు లేవని పాకిస్థానీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇంతకుముందు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ముంబయి దాడులకు పాక్ ప్రభుత్వ సంస్థల కూడా మద్దతు ఇచ్చి ఉంటాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
26/11 సాక్ష్యాలపై విశ్వసనీయ దర్యాప్తు: పాకిస్థాన్
పాక్‌లో అస్థిరత అన్ని దేశాలకు ప్రమాదకరం
గాజా దాడులు: ఒబామాపై నిప్పులు చెరిగిన జవహిరి
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ప్రమాణస్వీకారం
శ్రీలంక పోరులో 4073 మంది తీవ్రవాదులు మృతి
భారత్ ఇచ్చిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదు: పాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...