|
| బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ప్రమాణస్వీకారం |
| ఢాకా (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 10:52 IST ) | |
అవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనా మంగళవారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె ప్రధాని బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు 1996-2001 మధ్యకాలంలో హసీనా తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
అధ్యక్ష భవనంలో జరిగిన వేడుకలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఐయాజుద్దీన్ అహ్మద్ మంగళవారం ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన తొమ్మిదో సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ నేతృత్వంలోని తొమ్మిది పార్టీల కూటమి 259 స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లు ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో అవామీ లీగ్‌కు 230 సీట్లు దక్కడం గమనార్హం.
ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో హసీనా ప్రత్యర్థి, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా కేవలం 29 స్థానాలే దక్కించుకుంది. బీఎన్‌పీతో పొత్తుపెట్టుకున్న జమాత్ ఎ ఇస్లామీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. మరో నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. అభ్యర్థి ఒకరు మరణించడంతో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదాపడింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|