|
| భారత్ ఇచ్చిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదు: పాక్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009 ( 19:09 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తమకు భారత్ అందించిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ ఇచ్చిన సాక్ష్యాధారులు తాము చర్యలు తీసుకోవడానికి సరిపోవని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సహాయకుడొకరు చెప్పారు.
పాక్ పార్లమెంట్‌లోని దిగువ సభలో విదేశీ వ్యవహారాల కమిటీని ఉద్దేశించి విదేశాంగ శాఖ సహాయమంత్రి మాలిక్ అమద్ ఖాన్, కార్యదర్శి సల్మాన్ బషీర్ మంగళవారం మాట్లాడుతూ.. భారత్ సోమవారం పాక్ ప్రభుత్వానికి పంపిన సాక్ష్యాల్లో విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు.
ముంబయి దాడులకు సంబంధించి భారత్ విశ్వసించదగ్గ సాక్ష్యాలేమీ అందించలేదని చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తామకు బలమైన ఆధారాలు కావాలని చెప్పారు. అంతకుముందు అధ్యక్ష ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ఈ సాక్ష్యాధారాల నివేదికలో పరిపూర్ణత లేదన్నారు.
కొన్ని పాక్ మీడియా సంస్థలు వెల్లడించే పరిపక్వతలేని నివేదికల్లాగానే ఇది కూడా ఉందన్నారు. దీనిని ఆధారంగా చేసుకొని పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఈ ఆధారాలు సరిపోవని చెప్పారు. ముంబయి కుట్రదారులను తమకు అప్పగించాలని భారత్ పదేపదే చేస్తున్న డిమాండ్‌లు చేస్తున్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేదని ఆయన గుర్తు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|