యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత సైబర్ నెట్‌వర్క్‌లపై దాడులకు పాక్‌లో యత్నం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 14:45 IST )
ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం పాకిస్థాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు మన దేశంలోని కంప్యూటర్ నెట్‌వర్క్‌లపై దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాకిస్థానీ హ్యాకర్లు ఇప్పటికే దీనిని ఒకసారి ప్రయత్నించి చూస్తున్నారని హోంశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.

ముంబయి దాడుల అనంతరం పాక్‌లో నమోదయి ఉన్న ప్రముఖ వెబ్‌సైట్ల ద్వారా హ్యాకర్లు భారత సైబర్ నెట్‌వర్క్‌లపై దాడులకు యత్నిస్తున్నారని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు రాజుకున్నా, పాకిస్థానీ హ్యాకర్లు భారత కంప్యూటర్ నెట్‌వర్క్‌లపై దాడులు ప్రారంభిస్తున్నారని, ముంబయి దాడుల అనంతరం ఇది బాగా పెరిగిందని తెలిపారు.

లక్ష్యంగా చేసుకున్న కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని హ్యాక్ చేసేందుకు డబ్యూడబ్యూడబ్యూ.సాంగ్స్.పీకే వంటి వెబ్‌సైట్లు రూపొందించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

డబ్యూడబ్యూడబ్యూ.సాంగ్స్.పీకే వెబ్‌సైట్‌లో 12 లక్షల మందికిపైగా భారత యూజర్లు రోజూ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేస్తున్నారని సైబర్ నిపుణుడొకరు చెప్పారు. ఈ సైట్ల ప్రఖ్యాతి చెందడంతో, హ్యాకర్లు కొన్ని నిమిషాల్లోనే 12 లక్షలకుపైగా కంప్యూటర్లను తమ నియంత్రణలోకి తీసుకోగలుగుతారు. అనంతరం ప్రతి నిమిషానికి హ్యాకర్లు బారినపడిన కంప్యూటర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు: పాకిస్థాన్
భారత్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్
లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...