యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు: పాకిస్థాన్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 13:06 IST )
ముంబయి ఉగ్రవాద దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం సాక్ష్యాలు అందించిన తరువాత కూడా తన వాదనకు కట్టుబడి నిలిచింది. దాడులకు సంబంధించి భారత్ అందించిన సాక్ష్యాలు సరిపోవని తేల్చిచెప్పింది. ఈ సాక్ష్యాల ఆధారంగా తామెటువంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ దినపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తాజాగా అందించిన సాక్ష్యాలను పాకిస్థాన్ మూడు కోణాల్లో తోసిపుచ్చింది. ముంబయి దాడుల్లో భారత భద్రతా దళాలకు పట్టుబడిన కసబ్ ఇచ్చిన వాంగ్మూలం, న్యాయసమ్మతం కాదని పాక్ విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. అతడిని హింసించి, సేకరించిన సాక్ష్యాలకు న్యాయబద్దత చేకూరదని చెప్పారు.

ఆయుధాలు, ఇతర పాకిస్థాన్ తయారీ వస్తువులు తీవ్రవాదుల వద్ద నుంచే సేకరించారనేందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవనేది రెండో వాదన. తాజాగా తమకు అందించిన సమాచారంలో కొత్త అంశాలేమీ లేవని, భారత మీడియాలో ఇప్పటికే వచ్చిన వివిధ ఆరోపణల సమాహారమే ఈ సాక్ష్యాధారాల నివేదిక అని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ దినపత్రిక పేర్కొంది.

మరోవైపు పాకిస్థాన్ కూడా తమ దేశంలో జరిగిన తీవ్రవాద ఘటనల్లో భారత్ ప్రమేయం ఉందని నిరూపించేందుకు ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. భారత్ సోమవారం ముంబయి ఉగ్గరవాద దాడుల్లో పాకిస్థాన్ శక్తుల ప్రమేయం ఉందని నిరూపించే సాక్ష్యాలను ఆ దేశ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్
లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...