|
| లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్ |
| కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 14:58 IST ) | |
ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం తన దాడులను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ముల్లైతీవును చేజిక్కించుకోవడానికి ముందుకు కదులుతున్న లంక సైన్యం సోమవారం ఎలిఫెంటాపాస్ ప్రాంతాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సైన్యం ముల్లైతీవులో తలదాచుకుంటున్న ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ స్థావరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా సైన్యం ముందుకు సాగుతోందని సైనికాధికారులు తెలిపారు. ఎల్టీటీఈతో సాగుతున్న పోరులో సైన్యం సైతం చెప్పుకోదగ్గ మొత్తంలోనే తనవారిని కోల్పోతూ వస్తోంది.
అయితే ఎల్టీటీఈపై పట్టు సాధించడమే లక్ష్యంగా సైనిక దళాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడురోజుల క్రితం పులలకు కీలక స్థావరమైన కిళినోచ్చిని సైన్యం హస్తగతం చేసుకుంది. అనంతరం ముల్లైతీవును స్వాధీనం చేసుకునే దిశగా ఆ ప్రాంతానికి ముందున్న ఓడుసుడాన్ పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|