|
| మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు |
| కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 10:24 IST ) | |
తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్‌ను పట్టుకోవడమే లక్ష్యంగా రంగంలో దిగిన శ్రీలంక సైన్యం ఆ దిశగా చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. దీంతో రెండు రోజుల క్రితం పులలకు పట్టున్న కిళినోచ్చి సైన్యం వశం కాగా ప్రస్తుతం మళ్లైతీవును సైతం జయించేందుకు సైన్యం ముందుకు కదులుతోంది.
ప్రభాకరన్‌తో సహా ఇతర ముఖ్య నేతలు తలదాచుకునే అవకాశముందని భావిస్తున్న మళ్లైతీవు వైపు సాగుతున్న సైన్యం ఆదివారం నాటికి కీలకమైన ఒడుసుదన్ పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఎల్టీటీఈ దళాలు ఈ పట్టణం ద్వారానే మళ్లైతీవులోని తమ వారికి అవసరమైన వస్తువులను చేరవేయడం జరుగుతోంది.
భూతలంపై సైన్యాలు ముందుకు చొచ్చుకుపోతుండగా అదేసమయంలో శ్రీలంక వాయు సేన సైతం బాంబుల వర్షం కురిపిస్తూ టైగర్లను గుక్క తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలంక సైనిక వర్గాలు మాట్లాడుతూ మళ్లైతీవు తమ స్వాధీనంలోకి వచ్చేదాకా పోరు ఆపబోమని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|