|
| ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి |
| జకార్తా (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 10:09 IST ) | |
ఇండోనేషియాలో ఆదివారం సంభవించిన భూకంపం ధాటికి నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ భూకంపం ప్రమాదంతో సునామీ హెచ్చరికను జారీ చేసిన ప్రభుత్వం అనంతరం దాన్ని ఉపసంహరించుకుంది.
ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా దేశంలోని తూర్పు ప్రాతంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు, కట్టడాలు కూలిపోయాయి. తెల్లవారు జామున సంభవించిన ఈ భూకంపం ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది.
ధపాలవారీగా ఆదివారం మొత్తం భూమి కంపిస్తూనే ఉండడంతో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. ఇండోనేషియాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3, 7.6గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావానికి భయంతో జనం ఇళ్లు వదలి పారిపోయారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|