యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
ఢాకా (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009   ( 17:26 IST )
బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా సీనియర్ అవామీలీగ్ నేత జిల్లూర్ రహ్మాన్‌ను నియమించనున్నట్టు ప్రధాని కానున్న షేక్ హసీనా ప్రకటించారు. ప్రస్తుతం అధ్యక్షుడు ఇయాజుద్దీన్ అహ్మద్ వైదొలగిన తర్వాత జిల్లూర్ రహ్మాన్ పదవీ ప్రమాణం చేస్తారని ఆమె వెల్లడించారు.

ఢాకాలో శనివారం రాత్రి పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకరానంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ ఉప నేతగా నియమించిన ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పదవికి రాజీనామా చేస్తారన్నారు. పార్టీ సీనియర్ సభ్యుడిగా సుదీర్ఘకాలంపాటు సేవలందించిన ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భాషా ఉద్యమం సహా పలు పోరాటాల్లో ఆయన పాలు పంచుకున్నారని వెల్లడించారు. ఈ ప్రకటన ద్వారా మాజీ దేశాధ్యక్షుడు, జతియా పార్టీ చీఫ్ ఎర్షాద్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని హసీనా పక్కనబెట్టినట్లయింది. కాగా తనను అధ్యక్షుడు చేయకుంటే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని ఎర్షాద్ చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...