యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009   ( 13:14 IST )
భారత్‌లో ముంబై తరహా దాడులు పునరావృతమైతే పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హోం మంత్రి చిదంబరం హెచ్చరించారు. ఈ తరహా దాడులకు తమ భూభాగం ఉపయోగించబడదన్న గట్టి హామీలను పాక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడి పాలకుల సహకారం లేకుండా ఈ తరహా దాడులు జరిగే అవకాశం లేదని చెప్పారు.

ఢిల్లీలో ఆయన ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్‌పై దాడులకు తమ భూభాగం, వనరులు ఉపయోగించేందుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులను అనుమతించబోమని అక్కడ అధికారంలో ఉన్న వారి నుంచి తమకు గట్టి హామీ కావాలన్నారు.

అక్కడి ప్రభుత్వం, సైనిక పాలకులనుంచి ఉమ్మడిగా ఈ హామీలను కోరుతున్నామని చెప్పారు. ఇవి కేవలం కాగిత ప్రతులుగా ఉండవని, అంతర్జాతీయ సమాజానికి వీటిని ఇవ్వాలని తెలిపారు. మరోసారి పునరావృతమైతే పాక్ చెల్లించే మూల్యం భారీగానే ఉంటుందని హెచ్చరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
ముంబయి దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు పూర్తి: రైస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...