|
| లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక |
| లండన్ (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009 ( 12:00 IST ) | |
లక్ష ఉద్యోగాలు సృష్టించేదిశగా కొత్త ప్రణాళికను బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ శనివారం ఆవిష్కరించారు. 2009లో ప్రాధాన్యం కలిగిన అంశాలుగా ఉద్యోగ కల్పన, కార్బన్ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు ఉంటుందని తన ప్రణాళికలో పేర్కొన్నారు.
అబ్జర్వర్ పత్రికతో మాట్లాడుతూ ఉద్యోగ కల్పన ప్రణాళికలో భాగంగా కొత్త రైల్ లింక్‌లు, హాస్పిటల్ ప్రాజెక్టులు, సూపర్ ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌లో పెట్టుబడులకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఉద్యోగాలు కాపాడేలా బ్యాంకు రుణాలను కూడా ప్రోత్సహించనున్నామని తెలిపారు.
అలాగే ఆఫ్గన్ ప్రభుత్వాన్ని పటిష్ట పరచడం, ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ను భాగస్వామి చేయడం కూడా తమ ముందున్న ప్రాధమ్యాలన్నారు. గత కొద్ది వారాల్లో మరిన్ని సేనలను ఆఫ్గన్‌కు పంపామని తెలిపారు. ఆఫ్గన్‌లో రెండో అతి పెద్ద దళం తమదేనన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|