|
| కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే |
| కొలంబో (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 17:07 IST ) | |
గత పదేళ్లుగా ఎల్టీటీఈ ప్రధాన కేంద్రంగా విలసిల్లుతూ వచ్చిన కిళినోచ్చి ప్రాంతం సైన్యం ఆధీనంలోకి రావడం శ్రీలకం చరిత్రలో ఓ గొప్ప అంశంగా ఆ దేశ అధ్యక్షుడు మహీందా రాజపక్సే పేర్కొన్నారు. లంక సైన్యాలు సాధిస్తున్న విజయాల దృష్ట్యా ఇప్పటికైనా టైగర్లు వాస్తవాన్ని గ్రహించి లొంగిపోతే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
లంక సైన్యాలు శుక్రవారం కిళినోచ్చిని విజయవంతంగా హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజపక్సే మాట్లాడుతూ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. కిళినోచ్చిని హస్తగతం చేసుకోవడం కలేనంటూ కొన్ని రోజుల ముందు ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాజపక్సే ఎద్దేవా చేశారు.
నూతన సంవత్సర ప్రారంభంలో దేశం గర్వించే ప్రకటన చేయగల్గడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శ్రీలంక సైన్యం సాధించిన ఈ విజయాన్ని వర్ణించడానికి తనకు మాటలు చాలడం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|