యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
కొలంబో (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009   ( 17:07 IST )
తమిళ వేర్పాటువాద సంస్థ అయిన ఎల్టీటీఈపై మరింత పట్టు సాధించే దిశగా శ్రీలంక సైనిక దళాలు ముందుకు సాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఎల్టీటీఈ దళాలతో ముఖాముఖి తలపడుతున్న లంక సైన్యాలు ప్రస్తుతం చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయి.

ఇందులో భాగంగా శుక్రవారం ఎల్టీటీఈకి రాజకీయంగా పట్టు ఉన్న కిళినోచ్చిలో ప్రవేశించిన శ్రీలంక సైన్యం ప్రస్తుతం పులల మిలటరీ కేంద్రమైన మళైతీవు వైపు పయనిస్తోంది. దీంతోపాటు పులలకు పట్టున్న పలు స్థావరాలపై లంక సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది.

పదాతిదళానికి తోడు వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో శ్రీలంక సైన్యాన్ని నిలువరించడం పులులకు సాధ్యం కావడంలేదు. ఈ నేపధ్యంలో కిళినోచ్చిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విధంగానే మళైతీవును సైతం ఆధీనంలోకి తెచ్చుకోగలమని శ్రీలంక సైనిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

గత పదేళ్లుగా తమ ఆధీనంలోని కిళినోచ్చిలో శ్రీలంక ప్రభుత్వానికి సమాంతరంగా ప్రత్యేక ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చిన ఎల్టీటీఈకి ఆ ప్రాంతం లంక సేనల వశం కావడంతో కోలుకోలేని దెబ్బతగిలినట్టైంది. అదేసమయంలో లంక సైన్యాలు మళైతీవుపై కూడా పట్టు సాధించినట్టైతే ఎల్టీటీఈ ప్రాబల్యం ప్రశ్నార్ధకంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
ముంబయి దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు పూర్తి: రైస్
గాజా బాధితులకు భారత్ ఆర్ధిక సాయం
అనుమానితులను అప్పగించం: పాక్
తీవ్రవాదుల అప్పగింత లేనట్టే: మీడియా కథనం
ఎల్టీటీఈ కీలక స్థావరం లంక సైనికుల వశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...