|
| ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 3 జనవరి 2009 ( 11:26 IST ) | |
ముంబయి దాడుల నేపధ్యంలో విమర్శల పర్వానికి స్వస్తి పలికి భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు పాకిస్థాన్‌లోని అధికార పీపీపీ ప్రయత్నించాలని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పాక్ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉన్న కారణంగా దానిపై దృష్టి పెట్టాలంటూ ఆయన పీపీపీని కోరారు. ఈ విషయమై శుక్రవారం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ ముంబయి దాడుల అనంతరం ఇరు దేశాలు పరస్పరం విమర్శించుకునే విషయానికి స్వస్తి పలకాలని కోరారు.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా పీపీపీ చేసే ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పాక్‌కు సవాల్‌గా మారాయని షరీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|