యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తీవ్రవాదులకు పాక్ మాజీ ఆర్మీ అధికారుల శిక్షణ
న్యూయార్క్ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 12:21 IST )
ముంబయిలో దాడులు చేసిన తీవ్రవాదులకు పాకిస్థాన్‌కు చెందిన మాజీ ఆర్మీ అధికారులు శిక్షణ ఇచ్చారని అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. గతవారం ముంబయిలో తీవ్రవాదులు భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాల్గొన్న తీవ్రవాదులు పాక్ మాజీ ఆర్మీ అధికారుల వద్ద శిక్షణ పొందారని అధికారులు చెప్పినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

అమెరికా రక్షణ శాఖకు చెందిన ఒక మాజీ అధికారి బుధవారం మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐల్లో పనిచేసిన మాజీ అధికారులు ముంబయి తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు దేశ నిఘా సంస్థలు గుర్తించాయన్నారు. అయితే ఈ దాడులకు, పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు బయటపడలేదని ఆ అధికారి పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లోని కొన్ని శక్తులచే ముంబయి తీవ్రవాద దాడులకు కుట్ర జరిగిందని భారత్ బలంగా విశ్వసిస్తోంది. అయితే భారత్ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గత వారం ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడుల్లో 183 మంది మృతి చెందారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ భయానక దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బరాక్ ఒబామా వాణిజ్య కార్యదర్శిగా రిచర్డ్‌సన్
ముంబయి దాడుల్లో పాక్ ప్రమేయం లేదు: జర్దారీ
డిసెంబరు 5న రష్యా- భారత్ అణు ఒప్పందం
రష్యాతో సంబంధాలు పునరుద్ధరించనున్న నాటో
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...