యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముంబయి దాడుల్లో పాక్ ప్రమేయం లేదు: జర్దారీ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 12:57 IST )
గత వారం ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలను ఆ దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తోసిపుచ్చారు. ముంబయిలో జరిగిన తాజా తీవ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయం లేదన్నారు. అంతేకాకుండా భారత్ 20 మంది నేరస్తులను తమకు అప్పగించాలని చేస్తున్న డిమాండ్‌ను కూడా జర్దారీ ఈ సందర్భంగా తిరస్కరించారు.

అమెరికాకు చెందిన సీఎన్ఎన్ టెలివిజన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్దారీ మాట్లాడుతూ.. ముంబయి తీవ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలు చేతికి చిక్కిన తీవ్రవాది పాకిస్థానీయుడనే దానికి స్పష్టమైన ఆధారాలేమీ భారత్ తమకు ఇవ్వలేదని జర్దారీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భద్రతా దళాల చేతికి చిక్కింది పాకిస్థానీయుడేనా అని ప్రశ్నించారు.

ముంబయిలో దొరికిన అజ్మల్ అనే తీవ్రవాది పాకిస్థానీయుడనే దానిపై తనకు అనుమానం ఉందన్నారు. భారత్ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్ పరిశీలిస్తోందని చెప్పారు. తీవ్రవాదులు ఏ దేశానికి చెందినవారు కాదని, తాము కూడా కరాచీలో తీవ్రవాద దాడులు ఎదుర్కొన్నామని జర్దారీ పేర్కొన్నారు. గత రెండేళ్లలో కరాచీలో జరిగిన తీవ్రవాద దాడుల్లో తాము 40 నుంచి 45 మంది పౌరులను పోగొట్టుకున్నామని తెలిపారు. వీటిలో వందలాది మంది గాయపడ్డారని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
డిసెంబరు 5న రష్యా- భారత్ అణు ఒప్పందం
రష్యాతో సంబంధాలు పునరుద్ధరించనున్న నాటో
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...