|
| డిసెంబరు 5న రష్యా- భారత్ అణు ఒప్పందం |
| మాస్కో (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 12:07 IST ) | |
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో అదనపు రియాక్టర్ల నిర్మాణం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం ఉద్దేశించిన అణు సహకార ఒప్పందంపై భారత్, రష్యా దేశాలు ఈ నెల 5న సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్ మూడు రోజుల పర్యటన కోసం బుధవారం భారత్ వస్తున్నారు. ఈ పర్యటనలో ఇరుదేశాలు అణు ఒప్పందంపై సంతకాలు చేస్తాయని రష్యా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
కూడంకుళంలో నాలుగు అదనపు రియాక్టర్లు నిర్మించడంపై రష్యా ఆసక్తి కనబరుస్తోంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించడానికి రష్యా మక్కువ చూపుతోంది. ఈ విషయాన్ని రష్యా అణు శక్తి సంస్థ సీఈవో సెర్గీ కిరియెంకో వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|