యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
బ్యాంకాక్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:34 IST )
గత కొన్నివారాల నిరసనలతో దేశంలో నెలకొన్న అశాంతికి ముగింపు పలికేందుకు థాయ్‌లాండ్ ప్రధానమంత్రి మంగళవారం రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు థాయ్ రాజధాని బ్యాంకాక్ విమానాశ్రయాన్ని కూడా ముట్టడించిన సంగతి తెలిసిందే. దీంతో విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. తాజాగా ప్రధాని రాజీనామా చేయడంతో ఆందోళనకారులు కూడా పట్టుసడలించారు. బ్యాంకాక్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు శుక్రవారం పునరుద్ధరించబడనున్నాయి.

ఇదిలా ఉంటే థాయ్ రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం మూడు అధికార పార్టీలను రద్దు చేసింది. ఓట్లలో అవకతవకలకు పాల్పడి ఈ పార్టీలు అధికారంలోకి వచ్చాయని నిర్ధారణకు వచ్చిన థాయ్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మూడు అధికార పార్టీలపై ఐదేళ్ల నిషేధం అమలు కానుంది. అంతేకాకుండా ప్రధాని సోమ్‌చీ వోంగ్‌సావత్‌తోపాటు, ఈ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు, కార్యవర్గ సభ్యులు ఐదేళ్ల రాజకీయ సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు
ఎల్టీటీఈ కీలక పట్టణం లంక దళాల స్వాధీనం
పాక్‌ను ఆక్రమించుకుంటాం: తాలిబాన్ హెచ్చరిక
తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: భారత్ డిమాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...