యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:18 IST )
ముంబయిలో గత వారం జరిగిన తీవ్రవాద దాడులపై ఉమ్మడి దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముంబయి దాడులకు పాకిస్థాన్‌లోనే కుట్ర జరిగిందని భారత్‌తోపాటు, పలు ప్రపంచ దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయి.

దీంతో ముంబయి దాడులపై పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి మంగళవారం మాట్లాడుతూ... భారత్‌తో కలిసి ఈ దాడులపై దర్యాప్తు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉమ్మడి దర్యాప్తు వ్యవస్థను ప్రతిపాదించారు. పాక్ ప్రభుత్వం నడుపుతున్న పీటీవీలో జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఖురేషి ముంబయి దాడులను ప్రస్తావించారు. దాడుల బాధితులకు సానుభూతి తెలియజేశారు.

దాడుల దర్యాప్తులో భారత్‌కు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముంబయి దాడుల కుట్రదారులను పట్టుకునేందుకు అన్నిరకాలుగా భారత్‌కు సహకరిస్తామన్నారు.

ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సంక్షిష్ట చర్చల ప్రక్రియను నిలిపివేయవద్దని ఖురేషి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముంబయి దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకోవడం వలన ఉపయోగం లేదన్నారు. పాకిస్థాన్ కూడా తీవ్రవాద బాధితురాలేనని చెప్పారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రతిపాదించిన ఉమ్మడి దర్యాప్తు వ్యవస్థ ఏర్పాటును భారత్ తేలిగ్గా తీసుకుంది. 20 మంది తీవ్రవాదులను అప్పగించాలని తాము పంపిన నిరసన పత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నేరుగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు
ఎల్టీటీఈ కీలక పట్టణం లంక దళాల స్వాధీనం
పాక్‌ను ఆక్రమించుకుంటాం: తాలిబాన్ హెచ్చరిక
తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: భారత్ డిమాండ్
20 అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...