|
| అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు |
| బ్యాంకాక్ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 13:11 IST ) | |
థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్టు మంగళవారం ఆ దేశంలో ఉన్న అధికార పార్టీని రద్దు చేసింది. అంతేకాకుండా ప్రధానమంత్రి సోమ్‌చాయ్ వాంగ్‌సావత్‌ను రాజకీయాల నుంచి ఐదేళ్లపాటు బహిష్కరించింది. ఓటింగ్ అవకతవకలకు సంబంధించిన కేసులో థాయ్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
పీపుల్స్ పవర్ పార్టీని రద్దు చేయాలని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కోర్టు నిర్ణయంతో పార్టీ అధినేత, ఇతర కార్యవర్గ సభ్యులు ఐదేళ్లపాటు రాజకీయ సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది. థాయ్‌లో గత కొంతకాలంగా రాజకీయ సంక్షోభం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. దేశంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం దేశ రాజధాని బ్యాంకాక్‌లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని జరిగిన గ్రెనెడ్ దాడిలో 51 మంది గాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|