|
| ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు |
| బాగ్దాద్ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 13:01 IST ) | |
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా సేనలు ఉంటాయని ఇరాక్ ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇరాక్ సైన్యాన్ని పునర్నిమించేందుకు ఈ సమయం సరిపోతుందని ఇరాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాబక్ జబేరీ తెలిపారు. దేశంలో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఇరాకీ ఆర్మీ, పోలీసు దళాలు శాయశక్తులా కృషి చేస్తాయని చెప్పారు.
ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వం, పౌరులపై ఆయుధాలు ఉపయోగించే ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని జబేరీ పేర్కొన్నారు. ఇది తమ ప్రాథమిక సిద్ధాంతమన్నారు. స్వజాతీయులపై దాడులు చేసేవారు ఇరాకీయులు కాదని వ్యాఖ్యానించారు. దేశంలో స్థిరత్వం, భద్రత, ప్రాథమిక సేవలు కల్పించేందుకు ఇరాక్ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|