|
| ఎల్టీటీఈ కీలక పట్టణం లంక దళాల స్వాధీనం |
| కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 11:03 IST ) | |
తమిళ టైగర్లకు చెందిన ఒక వ్యూహాత్మక పట్టణాన్ని సోమవారం శ్రీలంక ప్రభుత్వ దళాలు స్వాధీనపరుచుకున్నాయి. శ్రీలంక సైన్యం సుమారు 18 ఏళ్ల తరువాత ఈ పట్టణంపై ఆధిపత్యం సాధించడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక సైన్యం ఎల్టీటీఈకి గట్టిపట్టు ఉన్న మల్లైతీవు ప్రాంతంలో పోరు కొనసాగిస్తోంది. క్రమక్రమంగా ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈ ప్రధాన స్థావరానికి చేరువ అవుతున్నాయి.
ఎల్టీటీఈ రాజధానిగా పేరొందిన కిళినోచ్చికి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న కోకవిల్ పట్టణాన్ని తాజాగా శ్రీలంక ప్రభుత్వ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఎల్టీటీఈతో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ పోరులో ప్రభుత్వ కీలకమైన గమ్యస్థానాన్ని చేరుకున్నట్లయింది. ఈ పట్టణాన్ని శ్రీలంక సైన్యం నుంచి 1990లో ఎల్టీటీఈ హస్తగతం చేసుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|