యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: భారత్ డిమాండ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 08:57 IST )
ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడులకు మూలాలు పాకిస్థాన్‌‍లో ఉన్నాయని తేలడంతో, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సోమవారం ఆ దేశాన్ని డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌లో ఉన్న కొన్ని శక్తులు ఈ దాడులు జరిపాయని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో దాడుల్లో తమ పాత్ర లేదని పాకిస్థాన్ చేసిన ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.

ఈ ప్రకటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరుస్తూ పాకిస్థాన్ హై కమిషనర్ షాహిద్ మాలిక్‌కు సమన్లు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా ఈ దాడులకు పాల్పడిన తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా అండర్‌వరల్డ్ డాన్‌లు దావూద్ ఇబ్రహీం, అజర్ మసూద్‌లను తక్షణమే తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ తాజాగా ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడుల్లో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. ఈ దాడులతో పాకిస్థాన్ పౌరులెవరికైనా సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే భారత నిఘా సంస్థలు మాత్రం కరాచీ నుంచి సముద్రమార్గంలో వచ్చిన పాక్ తీవ్రవాదులు ముంబయిలోని పది ప్రదేశాల్లో దాడులు చేశారని చెబుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
20 అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్
ముంబయి దాడులు: భారత్‌లో రైస్ పర్యటన
భారత్‌కు ఇజ్రాయేల్ తీవ్రవాద నిరోధక బృందం
నైజీరియా మారణకాండ: 400 మంది బలి
భారత్‌తో సంబంధాలు: చైనా సాయం కోరిన పాక్
భారత్‌కు పూర్తిస్థాయిలో అండ: బుష్ హామీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...