|
| అమెరికా దాడులకు పాకిస్థాన్ తీవ్ర ఖండన |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 12:02 IST ) | |
తమ భూభాగంలో అమెరికా వైమానిక దళానికి చెందిన మానవరహిత యుద్ధ విమానాలు జరుపుతున్న క్షిపణి దాడులపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ భూభాగంలో గత కొంతకాలంగా అమెరికా క్షిపణి దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మాట్లాడుతూ ఇటువంటి దాడులను ఏమాత్రం ఉపేక్షించదగినవి కాదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్థానిక తాలిబాన్ తీవ్రవాదులు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు మరోసారి క్షిపణి దాడులు జరిపితే తాము ప్రతికార చర్యలు చేపడతామని హెచ్చరించారు.
సమస్యాత్మక బాన్ను జిల్లాలో గురువారం జరిగిన అమెరికా క్షిపణి దాడిలో అల్ ఖైదా కీలక నేతతోపాటు ఆరుగురు మృతి చెందారు. దీనిపై అమెరికా దౌత్యాధికారికి పాకిస్థాన్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
అమెరికా సేనల ఇటువంటి దాడులతో పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నాయని పేర్కొంది. ఈ దాడులను తక్షణం నిలిపివేయాలని పాకిస్థాన్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|