యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
త్వరలో భారత్, రష్యా సంయుక్త యుద్ధవిన్యాసాలు
మాస్కో (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 11:54 IST )
హిందూ మహాసముద్రంలో భారత్, రష్యా నావికా దళాలు త్వరలో సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఆడెన్ గల్ఫ్‌లో జరిగే ఈ యుద్ధ క్రీడలకు ఇంద్రా- 2009 అని నామకరణం చేశారు. సముద్ర దోపిడిలను అడ్డుకునే విన్యాసాలు ఈ క్రీడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఇరుదేశాలు ఈ సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహించనున్నాయి.

వార్యాగ్ మిస్సైల్ క్రూయిజర్ నేతృత్వంలోని రష్యా ఫసిఫిక్ ప్రాంత దళం ఇందులో పాలుపంచుకుంటుంది. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు డిసెంబరులో రష్యా నౌకలు వ్లాదివోస్టాక్ నుంచి బయలుదేరనున్నాయని ఆ దేశ నావిక దళ ఉన్నతాధికారి రోమన్ మార్తోవ్ వెల్లడించారు. 2003 నుంచి భారత్ కలసి రష్యా నావికా దళ విన్యాసాలు నిర్వహించడం ఇది నాలుగోసారి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు
థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు: బంగ్లా ప్రభుత్వం
2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...