|
| పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 11:15 IST ) | |
సోమాలియా తీరంలో ఇటీవల సముద్రపు దొంగల నౌకను నీటిలో ముంచేసిన విజయానందంలో ఉన్న భారత్ తాజాగా ఆడెన్ గల్ఫ్‌లో విస్తృతస్థాయి గస్తీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరో నాలుగు యుద్ధ నౌకలను ఆడెన్ గల్ఫ్‌లో మోహరించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని భారత్ గురువారం వెల్లడించింది.
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఎటువంటి చర్యకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని నావికా దళ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ తబర్ అనే యుద్ధనౌక విధులు నిర్వహిస్తోంది.
తాజాగా మరికొన్ని యుద్ధనౌకలను ఆడెన్ గల్ఫ్‌లో మోహరించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని నావికా దళం తెలిపింది. కనీసం నాలుగు నౌకలను ఆడెన్ గల్ఫ్‌కు పంపే ప్రతిపాదనను రక్షణ శాఖ పరిశీలిస్తుందని వెల్లడించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుందని పేర్కొంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|