|
| థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి |
| బ్యాంకాక్ (ఏజెన్సీ), 20 నవంబర్ 2008 ( 14:55 IST ) | |
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి సోమ్‌చీ వాంగ్‌సావత్ కార్యాలయం వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై గ్రెనెడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల ఈ దాడి జరిగిందని ఆ దేశ మిలటరీ అధికారులు తెలిపారు.
అనేక మంది నిరసనకారులు తలదాచుకున్న భారీ గుడారంపై ఈ గ్రెనెడ్ దాడి జరిగింది. ఈ దాడికి ఎం- 79 రకం గ్రెనెడ్ ఉపయోగించారని ఆర్మీ జనరల్ ప్రాథోంఫోంగ్ కెసోర్న్‌సుక్ వెల్లడించారు. సమీపంలోని ఏదో ఒక ఎత్తైన భవనం నుంచి దీనిని పేల్చి ఉంటారని చెప్పారు.
ఆగస్టు నుంచి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమొక్రసీకి చెందిన నిరసనకారులు ప్రధానమంత్రి కార్యాలయం వెలుపలి ప్రదేశాన్ని ఆక్రమించి అక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ప్రధాని రాజీనామా చేసే వరకు తాము ఈ ఆందోళన నిలిపివేయబోమని వారు ప్రకటించారు. వారి నిరసన కార్యక్రమాలపై ఇప్పటికే అనేకసార్లు చిన్న బాంబు దాడులు, గ్రెనెడ్ దాడులు జరిగాయి. ఇంతకుముందు వరకు జరిగిన దాడుల్లో ప్రాణనష్టం కలగలేదు. గురువారం జరిగిన గ్రెనెడ్ దాడిలో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|