యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు: బంగ్లా ప్రభుత్వం
ఢాకా (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 13:00 IST )
బంగ్లాదేశ్‌లో ఆర్మీ మద్దతుతో అధికారంలో కొనసాగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం బుధవారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. డిసెంబరు 18న బంగ్లాదేశ్‌‍లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఇంతకుముందు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే, ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం రాత్రి మాజీ ప్రధానమంత్రులు ఖలీదా జియా, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాతో సమావేశమయ్యారు.

అయితే ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదని మధ్యంతర ప్రభుత్వ వాణిజ్య శాఖ సలహాదారు హుస్సేన్ జిల్లూర్ రెహమాన్ వెల్లడించారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు.

అంతకుముందు ఖలీదా జియా నేతృత్వంలోని రాజకీయ కూటమి దేశంలో ఎన్నికలకు ముందే ఎమర్జెన్సీ ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. దీనితోపాటు మరికొన్ని డిమాండ్‌లను పరిష్కరించకపోతే తాము ఎన్నికల్లో పోటీ చేయమని హెచ్చరించింది. డిమాండ్‌ల పరిష్కారం కోసం 48 గంటల గడువు కూడా విధించింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక
కెన్యా తీరంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్
ఆర్ఎస్ఎస్, బీడీ తీవ్రవాద సంస్థలు కావు: బ్రిటన్
యోగాపై ఫత్వా జారీకి మలేషియా సన్నాహాలు
అమెరికాతో ఒప్పందం వద్దు: ఇరాన్ స్పీకర్
ఐదు ఒప్పందాలపై ఈజిప్టు, భారత్ సంతకాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...