|
| కెన్యా తీరంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్ |
| నైరోబీ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 15:13 IST ) | |
కెన్యా తీరంలో సోమాలియా సముద్రపు దొంగలు సౌదీ అరేబియా ఆయిల్ ట్యాంకర్‌ను హైజాక్ చేశారు. ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్ అయిన విషయాన్ని అమెరికా మిలటరీ, బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు.
కెన్యా తీర ప్రాంత నగరం మొంబసాకు 450 నాటికన్ మైళ్ల దూరంలో ఉండగా, సిరీస్ స్టార్ అనే ఈ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. నౌకలో ఉన్న సిబ్బంది క్రొయేషియా, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియాకు చెందినవారిగా భావిస్తున్నారు.
నౌకలో ఇద్దరు తమ దేశ పౌరులు కూడా ఉన్నారని బ్రిటన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా సోమాలియా పైరేట్‌లు హైజాక్ చేసిన నౌకలన్నింటిలో ఇదే భారీ నౌక కావడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|