|
| ఆర్ఎస్ఎస్, బీడీ తీవ్రవాద సంస్థలు కావు: బ్రిటన్ |
| లండన్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 14:59 IST ) | |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బజరంగ్ దళ్ (బీడీ) తీవ్రవాద సంస్థలు కావని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్‌లో ఈ సంస్థల సభ్యులు అడుగుపెట్టేందుకు అడ్డంకులేమీ లేవని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ లేదా బజరంగ్ దళ్‌లను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రవాద సంస్థలకు పరిగణించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల సహాయమంత్రి లార్డ్ మలోచ్ బ్రౌన్ "హౌస్ ఆఫ్ లార్డ్స్"కు తెలియజేశారు.
బ్రిటన్‌లో ఒక సంస్థను తీవ్రవాద సంస్థగా పరిణించేందుకు సంబంధించిన నిర్ణయాలను 2000నాటి తీవ్రవాద చట్టం పరిధిలో తీసుకుంటామని చెప్పారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ సభ్యులను బ్రిటన్‌లో ప్రవేశించకుండా అడ్డుకోవాలని పాటన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రౌన్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. గత కొంతకాలంగా భారత్‌లో ఈ రెండు సంస్థలపై నిషేధం విధించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|