|
| జార్జియాలో కూలిన రష్యా యుద్ధవిమానం |
| బిలిసి (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 10:46 IST ) | |
రష్యా గూఢచర్య విమానం ఒకటి సోమవారం జార్జియా నుంచి వేరుపడిన దక్షిణ ఒసెటియాకు సమీపంలో కూలిపోయింది. ఈ విమానం కూలిన అనంతరం పేలడంతో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారని జార్జియా అధికారులు తెలిపారు.
అయితే ఈ వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించింది. తమను రెచ్చగొట్టేందుకు ఇటువంటి వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టులో దక్షిణ ఒసెటియా వద్ద రష్యా, జార్జియా సేనలకు జరిగిన చిన్న యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జార్జియా నుంచి వేరుపడిన దక్షిణ ఒసెటియా, అబ్‌ఖాజియాల స్వాతంత్ర్యాన్ని రష్యా గుర్తించింది. పాల్వీ గ్రామంలో పైలెట్ రహిత యుద్ధ విమానం కూలిపోవడం, అనంతరం అది పేలడంతో ఇద్దరు జార్జియా మిలటరీ ఇంజనీర్లు మృతి చెందారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|