|
| ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఖలీదా జియా అల్టిమేటం |
| ఢాకా (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 10:15 IST ) | |
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ పార్టీ చీఫ్ ఖలీదా జియా సోమవారం దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేతకు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. డిసెంబరు 18న జరగబోతున్న ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనాలంటే, ఎమర్జెన్సీని 48 గంటల్లోగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇది జరగకపోతే ఎన్నికలకు సంబంధించి నెలకొనే అనిశ్చితికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోమవారం రాత్రి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేతృత్వంలోని నాలుగు పార్టీల కూటమి సమావేశం అనంతరం జియా మాట్లాడుతూ తమ కూటమి ఎన్నికల్లో పాల్గొనాలంటే ప్రభుత్వం తమ ఏడు డిమాండ్‌లకు తలొగ్గాలని వ్యాఖ్యానించారు.
సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇటీవల సవరించబడిన ప్రజా ప్రాతినిథ్య చట్టం (ఆర్‌పీఐ)లోని కొన్ని అధికరణలను రద్దు చేయాలని, ప్రాంతీయ ప్రభుత్వాల ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మధ్య ఒక నెల వ్యవధి కల్పించాలనేవి తమ కూటమి ఇతర డిమాండ్‌లని జియా వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|