|
| పాకిస్థాన్‌లో రెండో గిరిజన ప్రాంతంపై సైన్యం దృష్టి |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 18:01 IST ) | |
పాకిస్థాన్ సైన్యం దేశంలో రెండో గిరిజన ప్రాంతంలో తీవ్రవాదుల వేట ప్రారంభించింది. వైమానిక దళానికి చెందిన హెలీకాఫ్టర్‌లు వాయువ్య ప్రాంతంలో మరొక గిరిజన ప్రాంతంపై దాడులు చేశాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతంలో గత కొన్నివారాలుగా పాకిస్థాన్ సైన్యం తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఖైబర్ కనుమ గుండా ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పాకిస్థాన్ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరు జరుపుతున్న అమెరికా, నాటో సేనలపై ఒత్తిడి పెంచేందుకు పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం గత కొంతకాలంగా పాక్ గిరిజన ప్రాంతాల్లోని తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే తమ భూభాగంలో జరుగుతున్న ఈ దాడులను పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|