యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అమెరికాతో రక్షణ ఒప్పందానికి ఇరాక్ ఆమోదం
బాగ్దాద్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 10:40 IST )
అమెరికాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని ఇరాక్ మంత్రివర్గం ఆమోదించిందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆదివారం వెల్లడించారు. అమెరికా సైన్యం మరో మూడేళ్లపాటు ఇరాక్‌లో ఉండేందుకు ఈ రక్షణ ఒప్పందం వీలు కల్పించనుంది. ఐక్యరాజ్యసమితి తీర్పు ప్రకారం ఇరాక్‌లో అమెరికా సైన్యం ఉండేందుకు ఈ ఏడాది చివరి వరకు మాత్రమే అనుమతి ఉంది.

అయితే ఈ గడువు ముగిసేలోగా ఇరుదేశాలు ఈ ఒప్పందాన్ని సిద్ధం చేశాయి. గడువు తీరిన తరువాత అమెరికా సైన్యాన్ని మరో మూడేళ్లపాటు ఇరాక్‌లో ఉండేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తుందని, దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ ప్రతినిధి అలీ అల్ దబాగ్ తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో 27 మంది ఇరాక్ మంత్రివర్గ సభ్యులు, ప్రధాని నౌరి అల్ మాలీకి హాజరయ్యారు.

ఇదిలా ఉంటే మంత్రివర్గంలోని మరో పది మంది మంత్రులు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరు ఈ సమావేశానికి దూరంగా ఉండటానికి గల కారణాలు తెలియరాలేదు. కొంతమంది మంత్రులు విదేశీ పర్యటనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని తరువాత 275 మంది సభ్యులు ఉన్న ఇరాక్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో ఒప్పందంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే దానిని కూడా దబాక్ వెల్లడించలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జి- 20 సమావేశం విజయవంతం: మన్మోహన్
చైనాలో బస్సు ప్రమాదం: 11 మంది మృతి
పైరేట్‌ల చెర నుంచి స్టోల్ట్ వాలర్ నౌక విడుదల
శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం
ఇండియా- చైనా యుద్ధ పత్రాలు బహిర్గతం
పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...