|
| జి- 20 సమావేశం విజయవంతం: మన్మోహన్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008 ( 17:13 IST ) | |
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన జి- 20 సమావేశం విజయవంతంగా ముగిసిందని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సరైన ప్రాతినిధ్యం పొందే దిశగా ఈ సమావేశంలో అడుగులు పడ్డాయని చెప్పారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెంచే విధంగా ఈ సమావేశంలో ఆశావహ పరిస్థితి కల్పించడం జరిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ప్రాధాన్యత పెంచారని ప్రధాని తెలిపారు. జి- 20 సదస్సులో పాల్గొని తిరిగి భారత్ వస్తున్న సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు.
గత రెండేళ్లుగా భారత్‌ను జి- 8 సమావేశాలకు కూడా ఆహ్వానిస్తున్నారు. అక్కడ భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో చర్చలు అంతంతమాత్రంగా జరిగేవి. అయితే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలకు, చెందుతున్న దేశాలకు మధ్య వాస్తవిక చర్చలు జరిగాయని ప్రధాని వెల్లడించారు.
పశ్చిమదేశాలు ఎట్టకేలకు వాస్తవిక దృష్టితో ఆలోచిస్తున్నాయన్నారు. ఆర్థిక శక్తి అభివృద్ధి చెందుతున్న దేశాలవైపు మొగ్గుచూపుతుందనే దానికి ఇది నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|