యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనాలో బస్సు ప్రమాదం: 11 మంది మృతి
బీజింగ్ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008   ( 16:55 IST )
చైనా ఈశాన్య ప్రాంతంలో ఉన్న హీలాంగ్‌జియాంగ్ ప్రావీన్స్‌లో ఎక్స్‌ప్రెస్‌వేపై వెళుతున్న బస్సు తిరగబడటంతో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 39 మంది ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు.

ప్రావీన్స్ రాజధాని హార్బిన్‌లో ఉన్న యిలాన్ కౌంటీలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. ప్రమాదానికి గురైన బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా బస్సు తిరగబడింది.

ట్రాఫిక్ పోలీసులు, హైవే అధికారులు వేగం తగ్గించుకోమని హెచ్చరించినా, బస్సు డ్రైవర్ వారి మాటలను పెడచెవినపెట్టాడు. రోడ్డు జారుడు స్వభావం కలిగివుండటం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణాలని హార్బిన్ పోలీసులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పైరేట్‌ల చెర నుంచి స్టోల్ట్ వాలర్ నౌక విడుదల
శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం
ఇండియా- చైనా యుద్ధ పత్రాలు బహిర్గతం
పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు
దలైలామాతో చర్చలకు చైనా ప్రభుత్వ సంసిద్ధత
రష్యా అధ్యక్షుడి పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...